top of page
MediaFx

అంబానీ పెళ్లికి రూ.40 కోట్ల ఖరీదైన భవనం గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ హీరో ..?


బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ ఇంట పెళ్లిలో తెగ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం ఈ వివాహానికి రావడం జరిగింది. టీమిండియా క్రికెటర్లు , మాజీ ఆటగాళ్లు సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. దాదాపు మూడు నెలలుగా ఈ వివాహ వేడుకలు జరిగాయి.


అలాగే ఈ పెళ్లికి రూ.5000 కోట్లు ఖర్చు అయ్యాయి. అంబానీ ఆస్తుల్లో రూ.5000 కోట్లు అంటే 0.05 శాతం మాత్రమే.ఇది వారికి చాలా అంటే చాలా చిన్న ఖర్చు.ఇదిలా ఉంటే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ నివేదిక ప్రకారం ..షారుఖ్ ఖాన్ అనంత్ , రాధిక దంపతులకు ఫ్రాన్స్‌లో రూ. 40 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇచ్చారని సమాచారం. బచ్చన్ కుటుంబం రూ.30 కోట్ల విలువైన పచ్చ నెక్‌లీస్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆకాష్ అంబానీకి అత్యంత సన్నిహితులైన అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు రూ.9 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును కొత్త జంటకు బహుకరించారు.అంతేకాదు సల్మాన్ ఖాన్ రూ.15 కోట్ల విలువైన స్పోర్ట్స్ బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. రణవీర్ సింగ్ మరియు దీపికా పదుకొణె రూ. 20 కోట్ల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్‌ను ఇచ్చినట్టుగా తెలుస్తోంది.కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ అనంత్ , రాధిక దంపతులకు రూ. 19 లక్షల విలువైన బంగారు గొలుసును బహుమతిగా అందించారు.

సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ రూ. 25 లక్షల విలువైన చేతితో తయారు చేసిన శాలువను బహుమతిగా ఇచ్చారు. ఈ పెళ్లికి దూరంగా ఉన్న సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సైతం వీరిద్దరికీ రూ.60 లక్షల విలువైన బంగారు పెన్ను అందించారని సమాచారం. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ. 300 కోట్ల ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇచ్చారని, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రూ. 11.5 కోట్ల విలువైన విలాసవంతమైన కారును పెళ్లి కానుకగా ఇచ్చినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ ఖరీదైన గిఫ్ట్‌లను ఇచ్చినట్టు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ ధృవికరించలేదు. దీంతో ఇదింతా కేవలం ప్రచారమే అని కొట్టిపారేస్తున్నారు.





bottom of page