top of page
MediaFx

అంబానీ ఇంట్లో పనివాళ్లకు నెలకు జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!


ముఖేష్ అంబానీ ఇంట్లో 500 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ సేవకులందరికీ మంచి, భారీ జీతం లభిస్తుంది. ఇటీవల ఆయన కుమారుడు అనంత అంబానీ వివాహం ఎలా జరిగిందో అందరికి తెలిసిందే. ప్రపంచం సైతం తిప్పుకునేలా అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది. ముఖేష్ అంబానీ తన ఉద్యోగుల సౌకర్యాలు పూర్తిగా చూసుకుంటారు. ఇంట్లో పని చేసే వంట మనిషి నుంచి డ్రైవర్‌ వరకు మంచి వేతనం ఉంటుంది. అంబానీ ఇంట్లో పని చేసేవారు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే అంబానీ ఇంట్లో పని మనుషులకు కూడా లక్షల్లో జీతం ఉంటుందట. ఏదైనా పని చేస్తే అంబానీ ఇంట్లో చేయాలనేన ఆలోచన వస్తుంటుంది. ఇలాంటి జీతం ఉంటుంది మరి. అంబానీ కుటుంబంలో పనిచేసే డ్రైవర్ నుంచి పని మనిషి వరకు లక్షల్లో జీతం ఉంటుందని మీకు తెలుసా? ఇక అంబానీ ఇంట్లో వంట చేసే చెఫ్ జీతం ఎంత అనేది తెలుసుకుందాం. వాళ్ల చెఫ్ జీతం వింటే షాక్ అవుతారు. సమాచారం ప్రకారం.. ముఖేష్ అంబానీ చెఫ్ నెల జీతం రూ.2 లక్షలు. ముఖేష్ అంబానీకి చెందిన చెఫ్ చాలా ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేయడానికి ఇంత డబ్బు వసూలు చేస్తున్నాడని మీరు అనుకుంటే అది పొరపాటే. అంబానీ శాకాహారి. అతను సాధారణ ఆహారాన్ని ఇష్టపడతాడు. చెఫ్ మాత్రమే కాదు, యాంటిలియాలో పనిచేసే ప్రతి ఉద్యోగి దాదాపు ఒకే జీతం తీసుకుంటున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖేష్ అంబానీ తన సిబ్బందికి ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్‌తో పాటు జీతం ఇస్తారు. పెద్ద విషయం ఏమిటంటే, ముఖేష్ అంబానీ సిబ్బందిలో కొంతమంది పిల్లలు కూడా అమెరికాలో చదువుతున్నారట. అయితే, ముఖేష్ అంబానీకి చెఫ్ లేదా డ్రైవర్ అవ్వడం అంత తేలికైన పని కాదు. దీని కోసం వారు అనేక పరీక్షలు పెడతారు. మీరు ఆ ప్రమాణాలన్నింటినీ ఆమోదించిన తర్వాత మీకు అక్కడ పని చేసే అవకాశం దక్కుతుంది. అంబానీ ఇంట్లో పని చేసే పని మనిషికైనా ఎన్నో పరీక్షలు నిర్వహిస్తారట.

bottom of page