top of page
MediaFx

😱 భారతదేశంలో అమెరికా మహిళకు షాకింగ్ అనుభవం!

భారత్‌లో ఓ అమెరికా మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రాజస్థాన్‌కు చెందిన ఓ నగల వ్యాపారి ఆమెను దారుణంగా మోసం చేశాడు. రూ.300 గిల్టు నగలను బంగారు ఆభరణాలుగా నమ్మించి ఏకంగా రూ.6 కోట్లకు అమ్మాడు. తాజాగా నిందితుడు, అతడి తండ్రిపై పోలీసు కేసు నమోదైంది.

అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళకు 2022లో రాజస్థాన్‌‌లోని జైపూర్ జోహ్రీ బజార్‌కు చెందిన నగల వ్యాపారి గౌరవ్ సోనీ, అతడి తండ్రితో పరిచయమైంది. ఈ క్రమంలో వారు ఆమెకు బంగారు ఆభరణాల పేరిట గిల్టు నగలను అమ్మి ఏకంగా రూ. కోట్లు దండుకున్నారు. నగలతో అమెరికాకు చేరుకున్న ఆమె వాటిని ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచగా అవి నకిలీవని తేలింది.

దీంతో, అగ్గిమీదగుగ్గిలమైన మహిళ భారత్‌కు తిరిగొచ్చి తండ్రీకొడుకులను నిలదీసింది. వారు మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించారు. దీంతో, మహిళ పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు భారత్‌లోని అమెరికా ఎంబసీ అధికారులను ఆశ్రయించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఎంబసీ అధికారులు స్థానిక పోలీసులను కోరారు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న తండ్రీకొడుకుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేబట్టారు.

bottom of page