top of page
Shiva YT

అమిత్ షా తెలంగాణ టూర్ ఫిక్స్.. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా..! 🚗🗳️

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ పార్టీ ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ లోనూ మరింత దూకుడు పెంచింది. తెలంగాణలో 10 రోజుల పాటు సాగే విజయ సంకల్ప్ యాత్రతో లోక్ సభ ఎన్నికల కోసం మొదటి దశ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించి మంచి జోష్ మీద ఉంది. ఈ యాత్రను నాలుగు వేర్వేరు ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు ఒకేసారి జెండా ఊపి ప్రారంభించి ప్రజల్లోకి వెళ్ళారు. అయితే ఈ నెల 24న హైదరాబాద్ లో జరిగే విజయ్ సంకల్ప్ యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. అమిత్ షా రాకతో విజయ్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాలు చురుగ్గా సాగనున్నాయి. అయితే తొలి దశ ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగించే అవకాశాలున్నాయి. అయితే తేదీ, స్థలం ఇంకా ఖరారు కాలేదు. 🗓️📍


ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో ఆకట్టుకునే స్ట్రైక్ రేట్ తో, బిజెపి తన ఓట్ల శాతాన్ని దాదాపు ఏడు శాతం మెరుగుపరుచుకుంది. లోక్ సభ ఎన్నికలకు ఓటర్ల ఆదరణ పరంగా బీజేపీ తమ ప్రత్యర్థులైన కాంగ్రె, బిఆర్ఎస్ కంటే చాలా ముందంజలో ఉందని చెప్పక తప్పదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13.90 శాతం ఓట్లు సాధించి 8 అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకుంది. 📊👥

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ‘ముందస్తు ప్రచారం’ మైలేజ్ పొందడానికి ‘విజయ్ సంకల్ప యాత్ర’ను ప్రారంభించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రులు బీఎల్ శర్మ, పురుషోత్తం రూపాలా సహా పార్టీకి చెందిన ప్రముఖ జాతీయ నాయకులు ‘విజయ్ సంకల్ప్ యాత్రలను’ ప్రారంభించారు. కార్యాచరణ సౌలభ్యం కోసం బీజేపీ రాష్ట్ర శాఖ తెలంగాణను ఐదు క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్ కు ‘స్టార్ లీడర్స్’ను కేటాయించి ఆయా ప్రాంతాల్లో ప్రచార యాత్రను నడిపించింది. 🎉🚀

bottom of page