top of page
Shiva YT

మన హీరోల్లో ఇన్‌స్టాగ్రామ్‌ కింగ్ ఎవరు? ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్?

హీరో పవన్ కల్యాణ్ ఎట్టకేలకు ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో బిజీ అవుతున్న ఆయన నెటిజన్ల అభిప్రాయాలను గమనించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలుగు హీరోల్లో ఇన్ స్టా కింగ్ ఎవరో చూద్దాం..

టాలీవుడ్ స్టార్ హీరో అయిన పవన్ కల్యాణ్, రాజకీయాల్లోనూ యాక్టివ్ అయ్యారు. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లోనూ బిజీ అయ్యారు. తను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసి, త్వరలోనే పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు.’ బ్రో’, ‘ఓజి’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హర వీర మల్లు’ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ అభిమానుల కోసం ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని చెప్పారు. తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. తన అభిమానులు, ఫాలోవర్లు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆయన పేరుతో ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ చేసినట్లు ఆయన సోదరుడు నాగబాబు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆయన ఇన్ స్టా బయోలో “ఏలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో .. జై హింద్!” అనే స్లోగన్ ను చేర్చారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోల్లో ఎవరు ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉన్నారు. ఎవరికి ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు? అనే విషయాన్ని తెలుసుకుందాం..

ఇన్ స్టాగ్రామ్ లో ఏ హీరోకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారంటే?

1. విజయ్ దేవరకొండ- 18.6M

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ జయ అపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సమంతాతో కలిసి ‘ఖుషీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ రౌడీ హీరోకు ఇన్ స్టాలో 18.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తెలుగు హీరోలలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోగా కొనసాగుతున్నారు.

2. రామ్ చరణ్ - 16M

ఇక అత్యధిక ఇన్ స్టా ఫాలోవర్లు కలిగిన తెలుగు హీరోలలో రామ్ చరణ్ రెండో స్థానంలో ఉన్నారు. ఈయనకు 16 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు.

3. మహేష్ బాబు 10.8M

టాలీవుడ్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన మూడో హీరోగా ప్రిన్స్ మహేష్ బాబు కొనసాగుతున్నారు. ఈయనకు ఇన్ స్టాలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. అటు రాజమౌళి దర్శకత్వంలో భారీ అడ్వెంచరస్ మూవీ చేయబోతున్నారు.

4. ప్రభాస్ 9.7M

పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ ఇన్ స్టాలో బాగానే అభిమానులకు సంపాదించుకున్నారు. ఈయను ఏకంగా 9.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. త్వరలో ఈయన నటించిన ‘సలార్’ చిత్రం విడుదల కానుంది.

5. అక్కినేని నాగ చైతన్య 7.5M

ఇక అక్కినేని హీరో నాగ చైతన్యకు ఇన్ స్టాలో 7.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈయన తాజా నటించిన ‘కస్టడీ’ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

6. జూ. ఎన్టీఆర్ 6.4M

‘RRR’ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇన్ స్టాలో బాగానే అభిమానులను కలిగి ఉన్నారు. 6.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈయన ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమాతో పాటు బాలీవుడ్ లోనూ కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు.

ఇక ఇతర హీరోల విషయానికి వస్తే నాని ఇన్ స్టాలో 6.2 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. రామ్ పోతినేని 3.7 మిలియన్లు, వరుణ్ తేజ్ 3.2 మిలియన్లు, మెగాస్టార్ చిరంజీవి- 2.4 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.


bottom of page