top of page
MediaFx

‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్..

ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తినే ఛాలెంజ్‌ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది. చైనాలో 24 ఏళ్ల సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాన్ షావోటింగ్ లైవ్‌ టెలికాస్ట్‌లో ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ చనిపోయింది. ఈ సంఘటన జూలై 14న జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇన్‌ఫ్లుయెన్సర్ పాన్ షావొటింగ్ ఈటింగ్‌ ఛాలెంజ్‌లు చేయడంలో ప్రసిద్ధి. ఆమె నిర్విరామంగా 10 గంటల కంటే ఎక్కువసేపు వివిధ ఆహార పదార్థాలను రుచి చూస్తూ లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తుంది. వెయిట్రెస్‌గా పనిచేసే షావొటింగ్‌ అధిక సంపాదన కోసం ఫుడ్‌ టేస్టర్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారింది. వెయిట్రెస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కొనసాగుతోంది. మంచి సంపాదనతో పాటు ఫ్యాన్స్‌ నుంచి కానుకలు ఆమెకు అందేవి. సోషల్‌ మీడియాలో ప్రతి ఈటింగ్‌ ఛాలెంజ్‌లో 10కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినేదని తెలుస్తోంది. అంతేకాదు రోజుకు 10 గంటల పాటు నిరంతరంగా ఆహారం తింటూ ఉండేది కూడా.

bottom of page