ఆనంద్ తొలిసారి మాస్, యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. బేబి తర్వాత ‘గం గం గణేశా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అగ్ర హీరోయిన్ సమంత సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.
విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్ దేవరకొండ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘బేబి’ సినిమాతో కెరీర్‌లో అతి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత అతను రూటు మార్చాడు. ఇన్నాళ్లూ సాఫ్ట్ సినిమాలు, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రల్లో నటించిన ఆనంద్ తొలిసారి మాస్, యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. బేబి తర్వాత ‘గం గం గణేశా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అగ్ర హీరోయిన్ సమంత సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హై లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.🎞️💫