top of page
MediaFx

ఆనంద్ దేవరకొండ ఇంత బాగా పాడగలడా..?

మొదటి సినిమా దొరసాని నుంచి ఇటీవల వచ్చిన గంగం గణేశా సినిమా వరకు ప్రతి సారి కొత్త కథలతో వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇటీవల వచ్చిన గం గం గణేశా సినిమా ఫుల్ లెంగ్త్ క్రైం కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆనంద్ ఫ్యామిలీతో అమెరికాలో ఉన్నాడు.

విజయ్ దేవరకొండ, ఆనంద్, వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్లారు. ఈ క్రమంలో, అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అమెరికాలో జరిగిన తెలుగు వారి ఈవెంటులో ఆనంద్ దేవరకొండ పాట పాడి అదరగొట్టాడు. తన సూపర్ హిట్ సినిమా బేబీ నుంచి "కంటి రెప్ప కనుపాపలాగా ఉంటారేమో కడదాకా" అనే ఎమోషనల్ సాంగ్ ని పాడాడు. సినిమాలో ఎంత బాగుందో ఈ పాట ఆనంద్ కూడా అంతే అద్భుతంగా పాడటంతో అంతా ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం ఆనంద్ అమెరికా ఈవెంట్లో పాట పాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆనంద్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా, ఇంత బాగా పాడగలడా అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు, నెటిజన్లు. భవిష్యత్తులో ఏదైనా సినిమాలో ఆనంద్ పాట పాడతాడేమో చూడాలి.


bottom of page