top of page
MediaFx

అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం హాలీవుడ్ పాప్ సింగర్..


ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. జులై 12న రాధికా మర్చంట్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ పెళ్లి హడావిడి చాలా కాలంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే సెలబ్రిటీలు చాలా మంది ఈ పెళ్లి వేడుకలో మెరిశారు. అలాగే హాలీవుడ్ పాప్ సింగర్స్ ను కూడా రంగంలోకి దింపారు. కాగా ఈరోజు (జులై 5) ముంబైలో సంగీత కచేరీ జరగనుంది. ఈ ఈవెంట్ కూడా బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు హాలీవుడ్ పాప్ సింగర్స్ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ కూడా రానున్నారు. ఈ ఈవెంట్ లో అతను తన పాటలతో ఉర్రుతలూగించనున్నాడు.  అందుకు గాను అతనికి భారీ రెమ్యునరేషన్  ఇచ్చారని తెలుస్తోంది. జస్టిన్ బీబర్ జూలై 4న ముంబై చేరుకున్నారు. 30 ఏళ్ల ఈ పాప్ సింగర్ ఒక రోజు ఈవెంట్ కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. దాదాపు 10 మిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు చేశాడు. అంటే ఇండియన్ రూపాయల్లో రూ. 83.51 కోట్ల రూపాయిలు. కాగా మొన్నామధ్య జరిగిన అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో పలువురు విదేశీ గాయకులు పాటలు పాడారు. అంతే కాదు ఈ సింగర్స్ కు కోట్లల్లో రెమ్యునరేషన్ ఇచ్చారు. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఇంత ఘనంగా జరిగాయి.. ఇప్పుడు పెళ్లి కార్యక్రమాలు కూడా అంతే రేంజ్ లో జరుగుతున్నాయి. జస్టిన్ బీబర్ చాలా పాపులర్ సింగర్. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి 29.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.. 2022లో జస్టిన్ బీబర్ ముఖం మీద పక్షవాతం వచ్చింది. దీంతో అతని షోలు చాలా వరకు రద్దయ్యాయి. ఇప్పుడు దాన్నుంచి పూర్తిగా కోలుకున్నాడు.


bottom of page