విజయ్ దేవరకొండ – అనసూయ మధ్య నడిచిన వివాదం గుర్తుండే ఉంటుంది. విజయ్ దేవరకొండ సినిమా వచ్చినప్పుడో, తను మీడియాలో హాట్ టాపిక్ గా మారినప్పుడో అనసూయతో గొడవ తెరపైకి మీడియా తీసుకొస్తుంటుంది. అనసూయ మీడియా ముందుకు వచ్చినా ఇదే ప్రశ్న రిపీట్ అవుతుంటుంది. ఈరోజు అనసూయ `సింబా` సినిమా ప్రమోషన్లలో పాల్గొంది. ఈ సందర్భంగా విజయ్ తో గొడవ సమసిపోయిందా? అనే టాపిక్ మళ్లీ వచ్చింది. దానిపై అనసూయ రియాక్ట్ అయ్యింది.
విజయ్ స్టేజ్ మేనర్స్ పైనే ఆరోజు తాను గొంతు విప్పానని, లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాల్సిన అవసరం ఉందని, దాని గురించే తాను మాట్లాడాల్సివచ్చిందని, నిజానికి ఇది మీడియా బాధ్యత అని, మీడియా మాట్లాడకపోవడం వల్లే ఆరోజు తాను స్పందించాల్సివచ్చిందని, అయితే ఈ ఇష్యూతో తాను కూడా కొంత నేర్చుకొన్నానని, తను చెప్పాల్సిన విషయాన్ని సరిగ్గా కన్వే చేస్తే బాగుండేదని అనసూయ పేర్కొంది. ప్రస్తుతానికైతే విజయ్ తో ఎలాంటి గొడవలూ లేవంది.
* పవన్ తో స్టెప్పులు పవన్ కల్యాణ్ – అత్తారింటికి దారేది సినిమాలో ఓ పాటలో కనిపించే అవకాశం అనసూయకు దక్కింది. అయితే అప్పట్లో తాను ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకొన్న పవన్ ఫ్యాన్స్ అనసూయని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ అనసూయకు ఆ ఛాన్స్ వచ్చింది. పవన్‌తో ఓ సినిమాలో తాను స్టెప్పులు వేశానని, ఆ పాట రాబోయే రోజుల్లో బాగా వైరల్ అయిపోతుందని, టీవీల్లో ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తుందని హింట్ ఇచ్చింది అనసూయ. పవన్ తో పని చేయాలని చాలా కాలంగా అనుకొంటున్నానని, అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయి, డిప్యూటీ సీ.ఎం కూడా అయిపోయారని, దాంతో తనకు ఛాన్స్ రాదేమో అని కంగారు పడ్డానని, ఎలాగోలా తనకు ఆ అవకాశం దక్కిందని మురిసిపోతోంది. అయితే అది ఏ సినిమాలోనో చెప్పడం లేదు. పవన్ చేతిలో హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఉన్నాయి. వీటిలో అనసూయ కనిపించేది ఏ సినిమాలో అనేది ప్రస్తుతానికి ఫజిల్.