బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రష్మీ గౌతమ్. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది రష్మీ..
యాంకర్ గా పలు టీవీ షోలతో అలరించిన రష్మీ.. సినిమాల్లోనూ నటించింది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మీ ఆతర్వాత హీరోయిన్ గాను చేసింది. సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో నటనతో పాటు తన అందాలతో కవ్వించింది రష్మీ.. అలాగే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెప్పించింది,. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉన్న ఈ చిన్నది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మీ గౌతమ్ పెళ్లి గురించి ఫిలిం సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.రష్మీ పెళ్లి గురించి గతంలోనూ చాలా వార్తలు వచ్చాయి. నటుడు , కమెడియన్ సుడిగాలి సుదీర్ తో రష్మీ ప్రేమాయణం సాగిస్తుందని .. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు పుట్టుకొచ్చాయి. జబర్దస్త్ షోలో వీరు క్లోజ్ గా ఉండటంతో.. వీరి మధ్య ఎదో జరుగుతుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవం అని ఆ ఇద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని కొందరు అంటున్నారు. కాగా ఇప్పుడు రష్మీ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.త్వరలోనే రష్మీ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది. అమెరికాకు చెందిన వ్యక్తితో రష్మీ గౌతమ్ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇటీవలే ఇద్దరు కుటుంబ సభ్యులు జాతకాలు కూడా చూపించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలోనే పెళ్లి ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. మరి దీని పై రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.✨