top of page
MediaFx

గంజాయిపై ఉక్కుపాదం.. 3 నెలల్లో మార్పులు తీసుకొస్తాం 🚔👊

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, గంజాయి మరియు డ్రగ్స్ నిర్మూలనపై మూడు నెలల్లో మార్పులు తీసుకొస్తామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు.గత వైసీపీ సర్కారు గంజాయి నిర్మూలనపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గంజాయి కారణంగా విశాఖలో నేరాల రేటు పెరిగిందని, 1,230 మంది గంజాయి కేసుల్లో విశాఖ జైలులో ఉన్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.గంజాయి వ్యాపారం చేద్దామన్న ఆలోచన ఉంటే వారు దాన్ని వెంటనే విరమించుకోవాలని, స్మగ్లింగ్ చేస్తే ఎవ్వరినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగిందని, చెక్ పోస్టులను పెంచుతున్నామని తెలిపారు. విశాఖలో గంజాయి వాడకం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

bottom of page