top of page
MediaFx

తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి వేడుకలు..

శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఘనంగా ప్రారంభించింది.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది. ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు క‌లిసి సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. బ్రహ్మకడిగిన పాదము శరణంటూ హరి అవతారమితుడు అన్నమయ్య శరణు శరణు కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టగా సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన ప‌ద్మ‌ప్రియ బృందం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల‌కు వ‌ర‌కు ఆర్తి బృందం గాత్ర సంగీత సభ నిర్వహించారు.

తాళ్ళ‌పాక ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్యామ్‌కుమార్ బృందం సంగీత సభ, రాత్రి 8 నుండి 9.30 గంటల వ‌ర‌కు తిరుపతికి చెందిన ర‌మేష్ బాబు బృందం హరికథ గానం చేసారు. రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, మ‌ణి బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన వెంక‌ట కృష్ణ‌య్య బృందం హరికథ కార్యక్రమాలను ఢిల్లీ టిటిడి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టుసంచాల‌కులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు పాల్గొన్నారు.

bottom of page