top of page
MediaFx

మార్కెట్లోకి మ‌రో ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్‌..


హువాయి బ్యాండ్ 8పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ వాచ్‌ను మిడ్‌నైట్ బ్లాక్‌, స‌కురా పింక్ క‌ల‌ర్స్‌లో లాంచ్ చేశారు. ఈ వాచ్‌ను ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే ఏకంగా 14 రోజులు వ‌స్తుందని కంపెనీ చెబుతోంది. హెవీ యూసేజ్ చేసే వారికి 9 రోజులు క‌చ్చితంగా వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వాచ్‌లో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచ‌ర్‌ను అందించారు.

5 ఏటీఎం వాట‌ర్ రెసిస్టెన్స్ సామ‌ర్థ్యంతో తీసుకొచ్చిన ఈ వాచ్ నీటిలో త‌డిచినా ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. అలాగే ఇందులో 1.47 ఇంచెస్‌తో కూడిన దీర్ఘ చ‌తుర‌స్ర ట‌చ్ ఏఎంఓఎలీఈడీ స్క్రీన్‌ను అందించారు. ఈ స్మార్ట్ వాచ్ స్లీప్ ట్రాకింగ్‌, స్ట్రెస్ లెవ్స్‌, ఎస్‌పీఓ2 లెవ‌ల్స్‌, హార్ట్ బీట్ మేజ‌ర్ వంటి హెల్త్ ఫీచ‌ర్ల‌ను అందించారు. 194*368 పిక్సెల్స్ రెజ‌ల్యూష‌న్, 282 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఈ వాచ్ సొంతం.


ఇక ఈ వాచ్‌లో పాలీమ‌ర్ ప‌దార్థాల‌తో త‌యారు చేసిన సైడ్ బ‌ట‌న్, సిలికాన్ లేదా టీపీయూతో చేసిన ప‌ట్టీని అందించారు. ఈ స్మార్ట్‌వాచ్ ఐఓఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్‌ల‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. బ్లూటూత్ 5.0తో ఫోన్‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. ధ‌ర విష‌యానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ రూ. 4699కి ల‌భిస్తోంది. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది.


bottom of page