చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీన లాంచ్ చేయనున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో మీకోసం.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 స్మార్ట్ ఫోనన్‌లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్ ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ప్రారంభ వేరియంట్ రూ. 25వేలలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.ఈ ఫోన్‌ను 8 ఈజబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నారు. అలాగే మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీని వన్ టిబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది.ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమెజాన్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. లాంఛింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్ అందించనున్నారని తెలుస్తోంది.