top of page
Shiva YT

టెలిగ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌… 💬

ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్‌ మరో కొత్త ఫీచర్‌ను పరియం చేసింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న టెలిగ్రామ్‌ ఈసారి కంపెనీల కోసం ప్రత్యేకంగా ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

కంపెనీలు, వారి కస్టమర్ల మధ్య కమ్యూనికేషన్‌ను పెంచే ఉద్దేశంతో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. గ్రీటింగ్ మెసేజ్‌లు, వేగవంతంగా సమాధానాలు ఇచ్చుకోడానికి క్విక్ రిప్లైస్, ఇంకా మరిన్ని ఆప్షన్లను టెలిగ్రామ్‌ విడుదల చేసింది.

అయితే ఈ కొత్త ఫీచర్‌ ప్రస్తుతం కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రీమియం యూజర్లకు ఈ కొత్త ఫీచర్లను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

టెలిగ్రామ్‌ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ద్వారా గ్రీటింగ్ మెసేజ్‌ల ద్వారా వ్యాపారులు తమ చానెల్‌కు మొదటిసారిగా కనెక్ట్ అయిన వారికి శుభాకాంక్షల మెసేజ్‌లను పంపవచ్చు. దీనిన ఆటోమెటిక్‌గా చేసుకునే అవకాశం కల్పించారు. క్విక్ రిప్లైస్ ఫీచర్ ప్రీసెట్ రిప్లై చాట్‌ను అందిస్తుంది.

అంతేకాకుండా యూజర్లు తమ వ్యక్తిగత టెలిగ్రామ్ ఖాతాలను బిజినెస్ ఖాతాలుగా మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ విషయమై టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్ దురోవ్‌ ప్రకటన విడుదల చేశారు. వీటితోపాటు మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నామని తెలిపారు. 📱

bottom of page