top of page

ఇస్రో మరో ప్రయోగం, నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 రాకెట్ 🚀🌌

Suresh D

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష కేంద్రంగా అనేక ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే చంద్రయాన్ లాంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో తాజాగా మరో ఉప గ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష కేంద్రంగా అనేక ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే చంద్రయాన్ లాంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో తాజాగా మరో ఉప గ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టింది. శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. వాతావరణ మార్పులు ప్రతికూలంగా మారిన సమయంలో మనదేశ వాతావరణ అంచనా సామర్థ్యాలను పెంపొందడం 🚀🌌 ఈ మిషన్ లక్ష్యం. కాగా భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాలకు అత్యాధునిక వాతావరణ ఉపగ్రహం INSAT-3DS సెప్టెంబర్ 2016 నుండి పని చేస్తోంది. అయితే తాజాగా నింగిలోకి దూసుకుపోయిన GSLV-F14 అనుసంధానంగా పనిచేస్తుంది. దాదాపు 27 గంటల కౌంట్ డౌన్ తర్వాత తర్వాత నింగిలోకి దూసుకుపోతోంది. ప్రతి ఉపగ్రహానికి కాలపరిమితి ఉంటుంది. అంతకు ముందే గ్రహాలకు దీని అనుసంధానం చేయబోతున్నారు.

GSLV-F14.. వాతావరణ మార్పులు, వాతావరణ సంబంధిత సవాళ్లు, వ్యవసాయం, విమానయానం, విపత్తు నిర్వహణతో సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది భూస్థిర బదిలీ కక్ష్యలో వ్యోమనౌకను మోహరించి, భూస్థిర కక్ష్యలోకి పెంచబడుతుంది. భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ పూర్తిగా నిధులు సమకూర్చింది. ఈ అధునాతన ఉపగ్రహం మెరుగైన వాతావరణ పరిశీలనలు, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం రూపొందించబడింది. ఈ ప్రయోగంతో అంతరిక్షంలో భారత్ మరోసారి తన ఉనికిని చాటుకుంది. 🛰️

 
bottom of page