ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీ ప్రకారం బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం మరింత సులభం అయ్యింది.
సాధారణంగా చెల్లింపు ఆథంటికేషన్ కోసం ఓటీపీలు లేదా ట్రాన్స్‌యాక్షన్ పాస్‌వార్డ్స్ ఉపయోగించడం పరిపాటి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో థంబ్ ఇంప్రెషన్ ద్వారా చెల్లింపును ప్రాసెస్ చేసే సిస్టమ్ ఉంది. అయితే తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అయిన అమెజాన్ అరచేతితో చెల్లింపు ధ్రువీకరణను అందించే సరికొత్త యాప్‌ను రిలీజ్ చేసింది. అమెజాన్ వన్ పేరుతో రిలీజ్ చేసిన ఈ యాప్ ద్వారా యూజర్లు అరచేతిని ఫొటో తీసి ఆథంటికేషన్ ఫైనల్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ అమెజాన్ వన్ అనే కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా కస్టమర్‌లు తమ అరచేతి గుర్తింపు సేవ కోసం సైన్ అప్ చేయడం సులభం చేస్తుంది. ఇప్పుడు ఫిజికల్ లొకేషన్‌కు వెళ్లే బదులు యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండే యాప్ ద్వారా వ్యక్తులు ఇల్లు, కార్యాలయం లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు సైన్ అప్ చేయవచ్చు. అయితే కొత్త యాప్ ప్రస్తుతానికి యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.రానున్న రోజుల్లో మిగతా దేశాల్లో దీని విస్తరించేలా చూస్తుంది