ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు హోరాహోరీగా సాగుతోంది. టీడీపీలో మంత్రివర్గ బెర్తుల కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. సీనియర్, జూనియర్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిష్టానం ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రులను ఎంపిక చేయాలని చూస్తోంది. బీజేపీ, జనసేన కూడా మంత్రివర్గంలో చేరే పరిస్థితి ఉండటంతో నేతల్లో టెన్షన్ పెరిగింది.
కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రమవుతోంది. భారీ మెజార్టీలతో కొంతమంది విజయం సాధించడం, రికార్డు స్థాయి విజయాలను నమోదు చేయడం వంటివి నేతల్లో ఆశలు పెంచాయి. విభజనలో సుస్థిర స్థానం ఉన్న నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. టీడీపీ గెలవని సీట్లు, పట్టు లేని చోట్ల విజయం సాధించిన నేతలు కేబినెట్‌లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గరిష్టంగా 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే, శ్రీకాకుళం, విజయనగరం, కడప, నెల్లూరు వంటి చిన్న జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో ముగ్గురేసి మంత్రులయ్యే అవకాశముంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జిల్లాల్లో నలుగురైదుగురు పోటీ పడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి కూన రవికుమార్, బెందాళం అశోక్‌లు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అచ్చెన్నాయుడికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అచ్చెన్నాయుడు అన్న రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నందున, అచ్చెన్నకు మంత్రి పదవిపై అనుమానాలు ఉన్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం విమర్శలకు దారితీయొచ్చు. అచ్చెన్నకు అవకాశం లేకుంటే మరో నాయకుడికి అవకాశం ఇస్తారా అన్నది చూడాలి.