పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు గారి పేరిట జరగనున్న "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" వేడుక జూన్ 29, 2024న హైదరాబాదు హోటల్ దసపల్లా లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం!
కళావేదిక (R.V. రమణ మూర్తి గారు) మరియు రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటివల ఈ వేడుక పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆయన సినీ ప్రముఖులు, NTR అభిమానులను ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
సినిమా రంగంలోని ప్రతిభావంతుల సేవలను గుర్తించేందుకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. చంద్రబాబు నాయుడు ఈ అవార్డ్స్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
జూన్ 29న జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్ లో సినీ మరియు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి అవుతాయి.