top of page
MediaFx

పాన్ ఇండియాను షేక్ చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్..


చూస్తున్నారుగా.. ఎంతమంది హీరోలో.. ఎన్ని ఓపెనింగ్సో..! పాన్ ఇండియా అంటే కేవలం హీరోలు మాత్రమేనా.. మేం కాదా అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్. అన్ని భాషల్నీ కవర్ చేస్తున్నారు వాళ్లు. భారీ బడ్జెట్ సినిమాలతో ఇండియన్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్రకు తెర తీస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. దాదాపు 2000 కోట్లు ప్రొడక్షన్‌లో పెట్టారు వీళ్లు. రిస్క్ అని తెలిసినా రప్ఫాడిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళం, హిందీలో సినిమాలు నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ పని అల్లు అరవింద్, అశ్వినీ దత్ ఎప్పుడో చేసారు. టాలీవుడ్‌లో మోస్ట్ బిజియెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ ఇదే. ఈ సంస్థ నుంచి 10 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. పైగా అన్నీ భారీ ప్రాజెక్ట్సే..  అందులో పుష్ప 2, RC16, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్ల వరకు ఉంటే.. బిజినెస్ 500 కోట్ల మేర జరుగుతుంది.

అలాగే ప్రభాస్, హను రాఘవపూడి సినిమాని ఈ మధ్యే మొదలుపెట్టారు. దీని బడ్జెట్ 300 కోట్లు. ఈ చిత్రంలో కొత్త భామ ఇమాన్ ఇస్మాయిల్ కథానాయకిగా నటిస్తుంది. ఇది ఈ బ్యూటీ తొలి చిత్రం. 

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక RC 16, RC17 బడ్జెట్ 500 కోట్ల పై మాటే. అలాగే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళంలోకి అడుగు పెడుతున్నారు మైత్రి మూవీ మేకర్స్.

మలయాళంలో ఇప్పటికే టోవినో థామస్‌తో నడిగర్ తిలకం సినిమా నిర్మించారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ బడ్జెట్ 200 కోట్ల పైమాటే. హిందీలో గోపీచంద్ మలినేని, సన్ని డియోల్ సినిమా భారీగానే ఉండబోతుంది. నిర్మాణమే కాదు.. సలార్, మంజుమ్మల్ బాయ్స్, హనుమాన్ లాంటి సినిమాలతో డిస్ట్రిబ్యూషన్‌లోనూ మెప్పిస్తుంది మైత్రి మూవీ మేకర్స్.

bottom of page