ఈ క్రమంలో భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై బిత్తిరి సత్తి క్షమాపణలు కోరాడు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆ వీడియోలో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని, ఎవరినీ కించపరచాలని చేయలేదు. నేను కూడా భగవద్గీతను ఆరాధిస్తాను. నేను చేసిన వీడియో వల్ల ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నాను అంటూ వీడియో ద్వారా బిత్తిరి సత్తి తెలిపారు.