top of page
MediaFx

ఓటీటీలోకి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్..

ఈ ఏడాది సినీ పరిశ్రమకు అంతగా కలిసిరాలేదు. ఈసారి వేసవిలో టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి పెద్ద సినిమాలేవి విడుదల కాలేదు. కేవలం ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. వారం వారం సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో యాక్షన్ థ్రిల్లర్ విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది. హాలీవుడ్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ సినిమా ఓటీటీలో ఫ్రీగా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. జియో సినిమా ఓటీటీలో ఈ సినిమాను ఫ్రీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి జేమ్స్ వాన్ దర్శకత్వం వహించగా.. ఇందులో జేసన్ మొమొవా కీలకపాత్రలో నటించారు. ఇందులో ఆక్వామాన్ అట్లాంటిస్ రూలర్ గా చూపించారు. నీళ్లలో అత్యంత వేగంగా స్విమ్ చేయడంతోపాటు నీటి లోపల ఉండే జీవులను నియంత్రించే శక్తి కలిగి ఉంటాడు. 2018లో వచ్చిన ఆక్వామాన్ తొలి భాగానికి సీక్వెల్ గా తెరకెక్కించారు ఈ చిత్రాన్నిత.

దాదాపు 21 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 43.4 కోట్ల డాలర్లు వసూలు చేసింది. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇన్నాళ్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ పద్దతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు మే 21 నుంచి జియో సినిమాలో ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది.


bottom of page