ఆరోగ్యంపై వేడి నీటి దుష్ప్రభావాలు: వేడినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మూత్రపిండాలు ప్రత్యేక కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయని, ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి. అయితే, వేడి నీళ్ల వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా వేడి నీరు తాగే వారిపై చెడు ప్రభావం చూపుతుంది. కిడ్నీలు ఎక్కువగా పని చేయడం వల్ల, పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల గొంతు మంట వస్తుంది. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల విపరీతమైన చెమట పడుతుంది. దీని వల్ల చెమట, దురద, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.
ఎక్కువగా వేడి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అదే పనిగా వేడి నీరు తాగితే అది ప్రేగులను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు, వేడినీరు తాగడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు వేడినీరు తాగడం నోటిపూతలకు కారణమవుతుందని చెబుతున్నారు. నిజానికి వేడినీరు తాగడం వల్ల ఎలాంటి రోగాలు నయం కావు. కాబట్టి వేడినీళ్లు తాగే అలవాటు ఉన్నవారు మరికొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు.