top of page
MediaFx

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా ?


ఊబకాయం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్య. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు పెరగడాన్ని నియంత్రించడానికి ప్రజలు జిమ్‌లో గంటల తరబడి శ్రమిస్తున్నారు. అరకొరగా ఆహారం తీసుకుంటున్నారు. దీనివల్ల లాభం లేదంటున్నారు నిపుణులు. భోజనం మానేయడం, డైటింగ్ చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ, మనం తీసుకునే ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు మొట్టమొదట చేయాల్సిన పని రాత్రి 7 గంటలలోపు భోజనం చేసేయాలి.రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య దాదాపు 3 గంటల గ్యాప్ ఉండాలంటున్నారు నిపుణులు. రాత్రిపూట భోజనం చేయడం వల్ల జీర్ణం సరిగా జరగదు. దీంతో జీవక్రియ ప్రభావితం అవుతుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే, సాయంత్రం త్వరగా తినడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే, రాత్రిపూట ఎల్లప్పుడూ లైట్‌ఫుడ్‌ తీసుకోవటం బెటర్‌ అంటున్నారు.

bottom of page