కొబ్బరి నీళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొబ్బరి నీటిలో అనేక పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ప్రతి రోజ ఒక కొబ్బరి బొండాం తాగితే అనేక ప్రయోజనాలు అందుతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఆరోగ్యమే కాకుండా.. చర్మ, జుట్టు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అయితే కొబ్బరి నీటిని చాలా మంది నేరుగా బొండాం నుంచి తాగుతూ ఉంటారు. ఇలా అస్సలు తాగకూడదని తాజాగా చేసిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరి నీళ్లను ఓ గ్లాసు లేదా ఇతర ఏదైనా పాత్రలో వేసుకుని తాగాలట. కొబ్బరి నీళ్లు నేచురల్‌గా వచ్చినా అందులో కూడా మలినాలు అనేవి ఉంటాయి. అలా నీళ్ళు తాగడం వల్ల అలర్జీలు, శ్వాస కోశ సమస్యలు తలఎత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫంగస్ ఏర్పడవచ్చు..
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కొబ్బరి నీళ్లు తాగితే శరీరం చల్లబడుతుంది. ముఖ్యంగా యూరినరీ ఇన్ ఫెక్షన్స్ ఏమైనా ఉంటే త్వరగా కంట్రోల్ అవుతాయి. ఈ నీటిలో మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే కొబ్బరి బొండాం లోపల ఎలా ఉందో చెప్పలేం. ఒక్కోసారి బొండాం లోపల ఫంగస్ వంటివి కూడా ఏర్పడవచ్చు. అది తెలీక మనం తాగడం వల్ల అనేక వ్యాధులు రావచ్చు.
సూక్ష్మ జీవులు ఎక్కువగా చేరతాయి..
కొబ్బరి బొండాంలో ఎక్కువగా మోల్డ్ అనే సూక్ష్మ జీవులు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. వీటిని ఫంగస్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇవి తడిగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి కొబ్బరి నీటిని ఒక గ్లాసులో వేసుకుని.. ఎలాంటి నల్లటి పదార్థాలు లేకపోతేనే తాగాలి. ఈ సూక్ష్మ జీవుల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కళ్లు ఎరుపుగా మారడం, తుమ్ములు, ముక్క నుంచి నీరు కారడం, ముక్కులో దురద రావడం, చర్మంపై దద్దుర్లు, దురద రావడం ఇలాంటి వస్తాయి.