top of page
MediaFx

పదే పదే మూత్రం వస్తోందా? అయితే, మీకు వ్యాధులు ఉండొచ్చు


సాధారణంగా రోజుకు 6 నుంచి 7 సార్లు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎక్కువ సార్లు టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తే మాత్రం.. సిస్టమ్‌లో ఏదో తేడా వచ్చిందనే భావించింది. అసలు ఈ సమస్యకు కారణాలు ఏంటో  ప్రముఖ నెఫ్రాలజిస్ట్.. పీఎస్ వలీ వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…. అధిక ద్రవాలు తీసుకోవడం: నీరు లేదా ఇతర ద్రవాలు ఎక్కువగా తీసుకునే వారిలో సహజంగానే యూరిన్ ఎక్కువ తయారవడం వల్ల యూరిన్ ఎక్కువ సార్లు వెళ్లాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కాఫీ లేదా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం: కాఫీ, మద్యం ఎక్కువ తీసుకునే వారిలో కూడా యూరిన్ తరచుగా వెళ్లాల్సిన అవసరం పడుతుంది.

 మధుమేహం (డయాబెటిస్): రక్తంలో అధిక చక్కెర (షుగర్) స్థాయిలు కూడా యూరిన్ తరచుగా రావడానికి ఒక కారణం.

మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్ (UTIs): యూరిన్‌లో ఇన్‌ఫెక్షన్ ఉన్న సందర్భాల్లో కూడా యూరిన్ ఎక్కువ సార్లు వచ్చినట్టు అనిపిస్తుంది.

ఇర్రిటబుల్ బ్లాడర్: కొందరిలో యూరినరీ బ్లాడర్ ఇరిటబుల్ గా తయారవడం వల్ల, మన ప్రమేయం లేకుండానే మాటిమాటికి యూరిన్ వెళ్లాల్సిన సెన్సేషన్ ఇబ్బంది పెడుతుంది. దీన్నే ఓవర్ ఆక్టివ్ బ్లాడర్ అంటారు.

ప్రోస్టేట్ సమస్యలు: కొంతమంది మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెద్దవడం వల్ల యూరిన్ తరచుగా రావడం జరుగుతుంది. దీన్ని ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎన్‌లార్జ్ అయిన ప్రోస్టేట్ గ్రంథి బ్లాడర్‌ని ఇర్రిటేట్ చేయడం వల్ల యూరిన్ తరచుగా వెళ్లాల్సిన తపన వస్తుంది.

నరాల సమస్యలు: కొన్ని సందర్భాల్లో నరాల సమస్యలు కూడా యూరిన్ తరచుగా రావడానికి కారణం అవుతాయి.

ఆందోళన, ఒత్తిడి: స్ట్రెస్, ఆందోళన కూడా యూరిన్ తరచుగా వెళ్ళడానికి కారణం కావచ్చు.

సో, యూరిన్ తరచుగా వస్తుంటే, కిడ్నీలకు ఏవో పెద్ద సమస్యలు వచ్చాయని అకారణంగా ఆలోచించకుండా, సరిగ్గా వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.

bottom of page