top of page
Suresh D

రూమ్ హీటర్స్ వాడుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..!🌡️❄️

శీతాకాలం మొదలైంది. ఉండే కొద్ది చలి తీవ్ర పెరుగుతుంది. ఒక్కోసారి కనీసం బయట తిరగలేనంత చలి కూడా ఉంటుంది. ఈ చలికి భయపడి చాలా మంది ఇంటి నుంచి బయటకు రారు. ఈ చలి నుంచి ఉపవశమనం పొందేందుకు చాలా రూమ్ హీటర్లు ఉపయోగిస్తారు.

శీతాకాలం మొదలైంది. ఉండే కొద్ది చలి తీవ్ర పెరుగుతుంది. ఒక్కోసారి కనీసం బయట తిరగలేనంత చలి కూడా ఉంటుంది. ఈ చలికి భయపడి చాలా మంది ఇంటి నుంచి బయటకు రారు. ఈ చలి నుంచి ఉపవశమనం పొందేందుకు చాలా రూమ్ హీటర్లు ఉపయోగిస్తారు. దీని వల్ల రూమ్ అంతా వెచ్చగా ఉంటుంది. కానీ వీటితో బోలెడన్ని దుష్ప్రభావాలు ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గాలితో తేమను తగ్గిస్తాయి:

రూమ్ హీటర్లు ఉపయోగించడం వల్ల ముఖ్యంగా చర్మం దెబ్బతింటుంది. చర్మం పొడిబారి పోతుంది. దీంతో మీ స్కిన్ నిర్జీవంగా, డల్ గా మారి కనిపిస్తుంది. ఇలా గాలిలో తేమ లేకపోవడం వల్ల శ్వాస కోశ సమస్యలు కూడా వస్తాయి. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే బెటర్.

అగ్ని ప్రమాద భయం:

పోర్టబుల్ రూమ్ హీటర్ల కారణంగా అన్ని ప్రమాదం కూడా జరగవచ్చు. మండే పదర్థాలను వీటికి దూరంగా ఉంచాలి. అలాగే హీటర్ ను ఎక్కువ సేపు ఇంటిలో ఉంచినా కూడా ప్రమాదమే. హీటర్ పక్కనే.. అగ్ని ప్రమాదాన్ని నియంత్రించే వస్తువులను పెట్టుకోవాలి. ఉదయం నుంచి కంటిన్యూగా హీటర్ ను ఉపయోగించకూడదు. మధ్యలో బ్రేక్ ఇవ్వాలి. 

రేడియేషన్ ఎఫెక్ట్:

కొన్ని రకాల హీటర్ల కారణంగా రేడియేషన్ కూడా కలుగుతుంది. దీని వల్ల చర్మం, కంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా చర్మం ఎర్రగా అవ్వడం, మంటలు వస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని హీటర్లు పర్యావరణంపై కూడా ప్రభావం చూపిస్తాయి.

కార్బన్ మోనాక్సైడ్ ను విడుదల చేస్తాయి:

తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని.. నాణ్యత లేని రూమ్ హీటర్లు తీసుకోకూడదు. దీని వల్ల విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ విడుదల అవుతుంది. కిరోసిన్, ఇంధనం ద్వారా ఉండే హీటర్ల కారణంగా కార్బన్ మోనాక్సైడ్ ను రిలీజ్ చేస్తాయి. దీని వల్ల తల నొప్పి, వికారం వంటివి కలుగుతాయి. దానికి తోడు ఇంట్లో సరైన విధంగా వెంటిలేషన్ లేకపోతే.. చాలా ప్రమాదం. కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్‌ను ఉపయోగించడం అవసరం. 🚨⚠️

bottom of page