🇮🇳 భారత దేశంలోని సరిహద్దు ప్రాంతాలపై కన్నేసి చైనా ఎప్పటికప్పడూ ఏదొక కంత్రీ ఆలోచన చేస్తూనే ఉంటుంది. 🌏 దీంతో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల బలోపేతం కోసం ఆర్మీకి మరింత వెసులుబాటు కనిపించేలా సౌకర్యాలను కల్పిస్తోంది. 🏞️
తాజాగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లడఖ్‌లోని న్యోమాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ వైమానిక స్థావరాన్ని నిర్మించబోతోంది. 🛰️ జమ్మూలోని దేవక్ వంతెనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. 🚧 వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై భారత్, చైనాల మధ్య నిరంతర ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. 🌄ఈ ఫైటర్ ఎయిర్‌పోర్టు నిర్మాణంతో చైనాకు భారత్ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. 🛫
మీడియా నివేదికల ప్రకారం.. BRO చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి వచ్చే రెండు లేదా మూడు సంవత్సరాలలో చైనాకు భారత్ గట్టిగా సమాధానం చెబుతుందని అన్నారు. 🤝 ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రభుత్వం 3488 కిలోమీటర్ల ఎల్ఏసీ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థానికంగా అభివృద్ధి చేసేందుకు వేగంగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. 🌄