ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు మడతపెట్టే ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ ఫోన్ జులై 20వ తేదీ నుంచి ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌తో పాటు, రిలయన్స్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..ధర విషయానికొస్తే మోటోరాల రేజర్ 50 అల్ట్రా 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 99,999గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 5000 డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే ఎంపిక చేసిన కొన్ని బ్యాంకు కార్డులపై అదనంగా మరో రూ. 5000 డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 89,999కే సొంతం చేసుకోవచ్చు. జులై 10వ తేదీ నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫోన్‌ను మిడ్ నైట్ బ్లూ, , స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ వంటి కలర్స్‌లో తీసుకొస్తున్నారు.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే మోటోరోలా రేజర్ 50 అల్ట్రా క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మెయిన్ స్క్రీన్‌ను ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ ని అందించారు. 165Hz రీఫ్రెష్ రేట్, 6.9 ఇంచెస్‌తో కూడిన మెయిన్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇక బయటి స్క్రీన్ 4 ఇంచెస్‌తో కూడిన ఎల్‌టీపీఓ,ఫ్లెక్సిబుల్ అమోలెడ్, 165Hz రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఫోన్‌ను ఫోల్డ్ చేసినప్పుడు వీడియోలు, నావిగేషన్ వివరాలు, సెల్ఫీలు వంటివి ఈ స్క్రీన్‌తో చేసుకోవచ్చు.కెమెరా విషయానికొస్తే ఈస్మార్ట్ ఫోఒన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. 30X ఏఐ సూపర్ జూమ్, ఏఐ యాక్షన్ షాట్, ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్ వంటి ఏఐ ఫీచర్లను కెమెరా కోసం ప్రత్యేకంగా అందించారు. ఇక లోపలి డిస్‌ప్లే 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అదించారు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే ఈ ఫోన్ 15 వాట్స్‌వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.