సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ప్రీమియం సెగ్మెంట్‌తో పాటు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్లను తీసుకొస్తోంది సామ్సంగ్. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మిడ్ రేంజ్ బడ్జెట్లో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్సంగ్ గ్యాలక్సీ ఎఫ్54 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సామ్సంగ్ గ్యాలక్సీ ఎఫ్54 స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్ప్లేను అందించారు. ఈ ఫోన్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ స్కానర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ సామ్సంగ్ గ్యాలక్సీ ఎఫ్54లో బ్యాటరీకి పెద్ద పీట వేశారు. ఇందులో ఏకంగా 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇవ్వడం విశేషం. ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇక ఫోన్‌ను ఎంత నాన్ స్టాప్‌గా ఉపయోగించినా 8 గంటల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. కెమెరాకు కూడా ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కెమెరా క్లారిటీ విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ 5జీ స్మార్ట్ ఫోన్లో మంచి టచ్ అనుభూతి కోసం సూపర్ స్మూత్ అనుభూతితో పాటు శక్తివంతమైన టచ్ శాంప్లింగ్ రేట్‌ను తీసుకొచ్చారు. ఈ కెమెరాతో 4కే రిజల్యూషన్ వీడియోను చిత్రీకరించవచ్చు. ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24000గా నిర్ణయించారు. ఆఫర్లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.