top of page
Suresh D

పుష్ప 2 త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ మూవీ🎥🎞️

జ‌వాన్‌తో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. పుష్ప -2 త‌ర్వాత బ‌న్నీ, అట్లీ మూవీ షూటింగ్ మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం.

పుష్ప -2 త‌ర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీకి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. త్రివిక్ర‌మ్‌, సందీప్ వంగాల‌తో అల్లు అర్జున్ సినిమాలు క‌మిట‌య్యాడు. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో పాటు మ‌రికొంద‌రు పాన్ ఇండియ‌న్ డైరెక్ట‌ర్ల‌తో అల్లు అర్జున్ సినిమా ఉండ‌నున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా మ‌రో కొత్త ద‌ర్శ‌కుడు పేరు తెర‌పైకి వ‌చ్చింది. 

జ‌వాన్‌తో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పుష్ప 2 షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే అల్లు అర్జున్‌, అట్లీ మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

అట్లీ మూవీతోనే అల్లు అర్జున్ అఫీషియ‌ల్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో హై ఇంటెన్స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అల్లు అర్జున్‌, అట్లీ మూవీ రూపొంద‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌, అట్లీ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందించ‌నున్న‌ట్లు స‌మాచారం.🎥🎞️

bottom of page