ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు షకీలా.. బీ గ్రేడ్ సినిమాలో నటించి పాపులారిటీ సొంతం చేసుకున్నారు షకీలా..శృంగార తారగా దేశవ్యాప్తంగా షకీలాకు క్రేజ్ ఏర్పడింది. చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు షకీలా. తెలుగుతో పాటు తమిళ్ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు షకీలా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న షకీలా.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే ఇప్పుడు ఆమె చాలా కష్టాలు అనుభవిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఆమె బిగ్ బాస్ షో లో పాల్గొన్నారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా పాల్గొన్నారు. కొన్నివారాలకే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. తాజాగా షకీలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షకీలా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె తన జీవితంలో చాలా ఎత్తు పల్లాలు చూశారు. ఆమె నటించిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దూసుకుపోయేవి ఆమె సినిమాలు. విపారీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఏకైక శృంగార తారగా నిలిచారు. అయితే చాలా వివాదాల్లో కూడా ఆమె చిక్కుకున్నారు. తాను ఏడూ ఎనిమిది మందితో ప్రేమాయణం సాగించాను అని తెలిపింది. కానీ వారు తనను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరు పైగా తన ఆస్థిని దోచేశారు అని గతంలో తెలిపింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నేను బీ గ్రేడ్ సినిమాలు చేసి సంపాదించిందంతా నా కుటుంబం కోసమే.. అప్పుడు నేను ఎవరికోసమైతే అంతగా కష్టపడ్డానో.. అంత సంపాదించానో వాళ్లు ఇప్పుడు నాతో లేరు. కేవలం డబ్బులు ఉంటేనే మనతో ఉంటారు. కానీ ఇప్పుడు నేను తినడానికి లేని పరిస్థితిలో లేను.. కానీ నాకంటూ ఎవ్వరూ లేరు అని అన్నారు షకీలా. అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి అనేది మన చేతిలో ఉండదు అన్నారు. అలాగే నేను 23 ఏళ్లకే అన్ని చూసేశా.. చిన్న వయసులోనే బాగా సంపాదించా.. 5 కార్లు , కొన్ని ఇళ్లు కొన్నాను. అందరిలానే నాకు అనిపిస్తుంది.. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి.. పిల్లలు ఉండాలి. అమ్మ అని పిలిచే వాళ్లు ఉండాలి అని ఎమోషనల్ అయ్యారు షకీలా. అలాగే చాలా మందిని ప్రేమించాను కానీ వాళ్లు మోసం చేశారు. మా అమ్మ నాతో ఉండకూడదు అని కండీషన్ పెట్టారు. ఇక నేను ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ జెండర్స్ ను దత్తత తీసుకున్నా అలా పెళ్లి కాకుండానే తల్లిని అయ్యాను వాళ్లకు పెళ్లిళ్లు చేస్తున్నా అని అన్నారు షకీల.