కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మీ సినిమా రంగంలోకి అడుగు పెట్టి నటిగా.. నిర్మాతగా రాణించిన విషయం తెలిసిందే. ఆమె నటిగా పలు సినిమాల్లో చేసి మెప్పించింది. అదేవిధంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోనూ నటించి మెప్పించింది మంచువారమ్మాయి.
పలు టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ టీవీ షోల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది ఈ టాలెంటడ్ యాక్టర్.
ఇటీవలే మోహన్ బాబు పై షాకింగ్ కామెంట్స్ చేసింది మంచు లక్ష్మీ.. తాను నటిగా మారడం తనకు ఇష్టం లేదు అని కామెంట్స్ చేసింది. అలాగే తాను ముంబై వెళ్లడం తన తండ్రికి ఇష్టముండదు అని తెలిపింది.
ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో నటించింది. యక్షిణి అనే హారర్ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో కనిపించింది మంచు లక్ష్మీ. సినిమాల్లో కనిపించకపోయినా పలు ఇంటర్వ్యూలో.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మంచు లక్ష్మీ.. రానా, రకుల్ ప్రీత్ చాలా సార్లు నన్ను ముంబైకి రమ్మని చాలా సార్లు అడిగారు. అక్కడికి వెళ్లిన తర్వాత తనకు ఉండటానికి అపార్ట్‌మెంట్ దొరక్కపోవడంతో కొన్నాళ్ల పాటు చరణ్ ఇంట్లో ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ.