top of page

ఆగస్టులో థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమాలు ఇవే.🎬🎥

ఈ ఆగస్టులో సినిమాల సందడి మాములుగా ఉండదు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ భోళాశంకర్ సినిమా గురించే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ఆగస్టులో సినిమాల సందడి మాములుగా ఉండదు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ భోళాశంకర్ సినిమా గురించే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరు సిస్టర్ గా కనిపించునది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ క్రికెటర్‌ ధోనీ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నిర్మిస్తున్న మొదటి సినిమా ఎల్‌జీఎం. ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చాలా మంది నటులు నటిస్తున్నారు. అలాగే ఆగస్టు 18న వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆదికేశవ సినిమా రిలీజ్ కానుంది. శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్‌’ ఆగస్ట్‌ 12న విడుదల కాబోతుంది. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న గాంఢీవధారి అర్జున ఆగస్టు 25న రిలీజ్ కానుంది. 🎬🌟 🎥


 
 
bottom of page