top of page
MediaFx

మిగిలిన టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..ఎంత ప్రమాదమో తెలుసా..?


మన దేశంలో చాలా మందికి ఉదయం నిద్రలేవగానే మిల్క్ టీ తాగడం అలవాటు. కానీ చాయ్ మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో తెలుసుకుందాం.

పోషకాలు కోల్పోతుంది

మిల్క్ టీని మళ్లీ వేడి చేయడం వల్ల కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు పోతాయి. ఎక్కువ సేపు కాచడం వల్ల ఈ పోషకాలు పూర్తిగా నశిస్తాయి.

రుచిలో మార్పు

మిల్క్ టీని మళ్లీ వేడి చేయడం వల్ల రుచి పూర్తిగా మారిపోతుంది. చేదుగా, అసహ్యకరంగా మారుతుంది. బ్యాక్టీరియా పెరగడం వల్ల దీనిని తాగడం ఆరోగ్యానికి హానికరం.

జీర్ణ సమస్యలు

పదే పదే వేడి చేసిన చాయ్ తాగడం వల్ల వికారం, విరేచనాలు వస్తాయి. ప్రొటీన్లు కరిగిపోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు తగ్గుతాయి

మిల్క్ టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ గుణాలు నశిస్తాయి. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు పోతాయి.

చాయ్‌ను తాజాగా తయారు చేసుకోవడం ఉత్తమం. మళ్లీ మళ్లీ వేడి చేయడం ద్వారా పోషకాలు, రుచి, ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి.

bottom of page