top of page
Suresh D

మనిషిలా మారిపోతానని బెదిరిస్తోన్న ఏలియన్ - ‘అయలాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది.. 🎬

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో శివ కార్తికేయన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్‌’. ఆర్. రవి కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటించింది. చాలా ఏళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు తమిళ భాషల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే బయటకు ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా, తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. 🎥


bottom of page