top of page
MediaFx

బాల రామయ్య ఆలయానికి బాంబు బెదిరింపులు 🚨


అయోధ్యలో కోట్లు మంది హిందువుల కలను తీరుస్తూ బాల రామయ్య 500 ఏళ్ల తర్వాత కొలువుదీరాడు. రామయ్యను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి పోట్టుతున్నారు. కాని, ఈ ఉత్సాహాన్ని ఉగ్ర ముప్పు మసకబారుస్తోంది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించడంతో భద్రతా చర్యలు పెంచారు.

ఎస్ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ స్వయంగా శ్రీరామ మందిరం, మహర్షి వాల్మీకి విమానాశ్రయం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మాన్యువల్, ఎలక్ట్రానిక్ నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.

ప్రతి మూలలో సీసీ కెమెరాలు శ్రీరామ మందిర సముదాయంలో అన్ని సందుల్లో భద్రతా బలగాలను మోహరించారు. పోలీసులే కాకుండా పీఏసీ కంపెనీలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. నగరంలోని అన్ని ముఖ్యమైన సంస్థలు, ఇతర సంస్థల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగర మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రియల్ టైమ్ ఇన్‌పుట్ తో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

జైషే మహ్మద్ బెదిరింపుల నేపథ్యంలో అయోధ్య నగరాన్ని హై అలర్ట్ ప్రకటించారు. పోలీసు అధికారులు ఆ నగరాన్ని దుర్భేద్యమైన కోట కంటే సురక్షితంగా మార్చామని చెబుతున్నారు. అయినప్పటికీ ఏ ఉగ్ర ముప్పును తేలికగా తీసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీరామ మందిరానికి భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

bottom of page