top of page
Suresh D

🚗💔 పెళ్ళి బృందాన్ని కావాలని కారుతో ఢీకొట్టిన యువకుడు, యువతి మృతి 💔🚗

👰‍♀️🚗 అప్పటి వరకు పెళ్లి సంబురాల్లో మునిగి తేలింది ఆ కుటుంబం. పాత కక్షలతో మనుసులో పెట్టుకొని ఒక వ్యక్తి కారుతో గుద్ది పెళ్లి బృందంపై దాడి చేయటంతో, ఆ కుటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

🚗👰‍♀️ పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని, వైరి వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు, బంధువులపై కారుతో ఢీకొట్టి చంపడానికి ఒక యువకుడు ప్రయత్నించిన సంఘటన చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది.

🔴 ఈ సంఘటనలో ఒక యువతి మృతి చెందగా, మరొక నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెడ్డిపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీ నివాసి ఉప్పు వెంకటి తన కుమార్తె సువర్ణ వివాహం గ్రామంలో బంధువుల సమక్షంలో అంగరంగవైభోగంగా జరిపించాడు.

🎉 వివాహానంతరం, వడ్డెర కాలనీ లో బంధువులతో భారీ ఎత్తున బరాత్ తీసి సువర్ణని ఆనందోత్సహాలతో అత్తగారింటికి సాగనంపారు. ఆ తర్వాత, బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ చివారు నుండి ఇంటికి కాలినడకన ఇంటి దారిపట్టారు. అయితే వారి వెనుకగా కారుతో విపరీతమైన వేగంతో వచ్చిన ఉప్పు నరేందర్ అనే వ్యక్తి వారి మీదుగా తొక్కించుకుంటూ వెళ్లడంతో, పెళ్లి బృందం కకావికలమయ్యింది.

💔💐 బృందంలోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ప్రధమ చికిత్స తర్వాత, హుటాహుటిన అంబులెన్సు లో హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఉప్పు రమ్య (18) అనే యువతీ గురువారం రాత్రి మృతి చెందింది. ఈ సంఘటనలో, గాయపడ్డ మిగతా నలుగురిలో రెండు సంవత్సరాల బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.

👥 స్థానిక బీజేపీ లీడర్ గా చలామణి అవుతున్న నరేందర్ కుటుంబానికి ఉప్పు వెంకటి కుటుంబానికి గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే, పగతో వెంకటి కుటుంబం పైన కారు తో తొక్కించి ఉపేందర్ దాడికి పాల్పడ్డాడని స్థానికులు అంటున్నారు.

🚔 ఉప్పు రమ్యతో పాటు, ఉప్పు దుర్గయ్య, సంపంగి యాదగిరి, ఉప్పు సుజాత, బబ్బూ అనే రెండు సంవత్సరాల బాలిక ఉన్నారు. విషయం తెలుసుకున్న, చేగుంట పోలీసులు, ఘటనా స‌్థలానికి చేరుకొని విచారణ చేసి కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు నరేందర్ ని తమ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సంఘటన, వివాహం జరిగిన ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో అదే దారిలో పోతున్న వ్యక్తి వాహనం కూడా ధ్వంసం అయినట్టు తెలుస్తుంది 🚗💔

bottom of page