top of page
MediaFx

బాహుబలి ప్రభావం సౌత్ లో సీక్వెల్స్ ట్రెండ్

సౌత్ ఇండియన్ సినిమాల్లో సీక్వెల్స్ ట్రెండ్ బాహుబలి నుంచి ప్రారంభమైంది. బాహుబలి మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో, దాని సీక్వెల్ బాహుబలి 2 భారీ హైప్ క్రియేట్ చేసి, బ్లాక్ బస్టర్ గా మారింది. ఇది ఇండియాలో టాప్ 5 అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో ఉంది. ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ కేజీఎఫ్ రెండు భాగాలుగా విడుదలై, రెండూ సూపర్ హిట్స్ అయ్యాయి, కేజీఎఫ్ 2 ఏకంగా 1200 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది కానీ ఇతర భాషలలో అంతగా క్లిక్ కాలేదు. ఇప్పుడు పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్స్ కి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కువ రోజులు షూటింగ్. ఈ నాలుగు ఫ్రాంచైజ్ లలో కేవలం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మాత్రమే 210 రోజుల్లో పూర్తయింది.

బాహుబలి షూటింగ్ కోసం రాజమౌళి 658 రోజులు, కేజీఎఫ్ 1, 2 షూటింగ్ కోసం ప్రశాంత్ నీల్ 1210 రోజులు, పుష్ప షూటింగ్ కోసం సుకుమార్ 1085 రోజులు తీసుకున్నారు. దీనితో పుష్ప సీరిస్ తెలుగులో అత్యధిక కాలం షూటింగ్ జరిపిన ఫ్రాంచైజ్ గా నిలుస్తోంది.

మరియు రాబోయే సలార్, దేవర, కల్కి 2898 ఏడి ఫ్రాంచైజ్ లు ఈ రికార్డ్ బ్రేక్ చేస్తాయా లేదా తక్కువ రోజుల్లో పూర్తవుతాయా చూడాలి. ఎక్కువ రోజులు షూటింగ్ వల్ల స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒక్కటి మాత్రమే విడుదల అవుతుండడంతో విమర్శలు వస్తున్నాయి. షూటింగ్ సమయాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

bottom of page