బంతి పూలతో పూజలే కాదు.. కాంతివంతమైన చర్మం మీ సొంతం..
- MediaFx
- Aug 8, 2024
- 1 min read
మొటిమలను..
సీజన్ ఏదైనా సరే.. చాలా మది మొటిమలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతి రోజూ మూడు నుంచి 4 బంతి పూలను తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుకు కొద్దిగా పెరుగు కలిపి.. ముఖంపై రాయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. మొటిమలు తగ్గుతాయి.
బంతి పువ్వు టోనర్:
ఫేస్‌ని టోన్ చేయడానికి చాలా మంది బయట మార్కెట్లో లభ్యమయ్యే టోనర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం బంతి పూలతో కూడా టోనర్ తయారు చేసుకోవచ్చు. బంతి పూలలో కొద్దిగా నీరు పోసి.. ఓ పావు గంటసేపు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని చల్లార్చి.. అందులో అలోవెరా జెల్ కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి.. ముఖానికి టోనర్‌లా ఉపయోగించవచ్చు. బంతి పువ్వు ఆయిల్:
బంతి పూలతో ఆయిల్ కూడా తయారు చేస్తారు. ఆ నూనెను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి పడుకోండి. ఉదయం గోరు వెచ్చటి నీటితో ముఖం శుభ్రం చేయండి. ఇలా కొద్ది రోజులు చేయడం వల్ల మీ ముఖం మెరుస్తుంది.
మెరిసే ముఖం కోసం..
కొద్దిగా బంతి పూల పేస్ట్, పాల మీగడ, తేనె, శనగ పిండి.. వీటిని కొద్దిగా తీసుకుని అన్నీ మిక్స్ చేయాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి పావు గంట తర్వాత రుద్దుతూ కడిగేయండి. ఇలా చేయడం వల్ల.. మీ చర్మంతో గ్లోని ఖచ్చితంగా చూస్తారు.