top of page
Suresh D

బంగ్లాదేశ్ లో జవాన్ సినిమాపై బ్యాన్..🙅‍♂️🇧🇩

బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో దేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితుల్లో జవాన్ సినిమా విడుదల చేయడం వల్ల ఆందోళనలు జరిగే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు భావించింది.

ప్రపంచ దేశాల్లో విడుదలైన జవాన్ సినిమాను బంగ్లాదేశ్ మాత్రం బ్యాన్ చేసింది. ఆ దేశంలో జవాన్ సినిమా విడుదలను బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు నిలిపివేసింది.బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో దేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితుల్లో జవాన్ సినిమా విడుదల చేయడం వల్ల ఆందోళనలు జరిగే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు భావించింది. సినిమాను తాత్కాలికంగా బ్యాన్ చేస్తూ విడుదలను ఆపేసింది. సెన్సార్ బోర్డు నిర్ణయంపై షారుఖ్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

జవాన్ సినిమాను వెంటనే రిలీజ్ చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. కాగా, షారూఖ్ సినిమా పఠాన్ కూడా బంగ్లాదేశ్ లో విడుదల కాలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత ఆలస్యంగా బంగ్లాదేశ్ లో రిలీజ్ అయింది. తాజాగా జవాన్ సినిమా కూడా తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని షారుఖ్ అభిమానులు భావిస్తున్నారు.🙅‍♂️🇧🇩

bottom of page