పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ వ్యాఖ్యలు.. సీఎంకు బండ్ల గణేష్ విన్నపం🎞️🎥
- Suresh D
- Oct 13, 2023
- 2 min read
బండ్ల గణేశ్ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.

బండ్ల గణేశ్. . ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. వీటన్నిటికీ మించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీర భక్తుడిగానే అందరూ బండ్ల గణేశ్ ను గుర్తిస్తారు. ‘ఈశ్వరా పవనేశ్వరా.. పవరేశ్వరా’ అంటూ పవన్ గురించి ఆడియో ఫంక్షన్లలో బండ్లన్న చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్‌ను దేవుడిగా భావించే బండ్ల గణేశ్ చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లోకి వచ్చారు. జనసేన అధినేత గురించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలను బండ్ల గణేశ్ ఖండించారు. పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషని, ఆయనపై ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం సహేతుకం కాదంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ‘అందరికీ నమస్కారం.. నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన.. ఒకటే బాధ.. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే.. నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది.. చిరాకు తెప్పిస్తోంది.. నిన్న సీఎం జగన్ నాకు ఇష్టుడైన పవన్ కల్యాణ్ గురించి కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. ఇవి నాకెంతో బాధ కలిగించాయి.. నేను కొన్ని దశాబ్దాల పాటు పవన్ కల్యాణ్ వెంట తిరిగాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఆయన చాలా నిజాయితీ పరుడు, నీతిమంతుడు. ఎవరు ఎలాంటి కష్టంలో ‘నేనున్నా’ అంటూ ముందుండి సాయ పడే భోళా మనిషి. ఇప్పుడు అలాంటి మనిషి గురించి మీరు (సీఎం జగన్) వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. జీవితంలో అందరికీ అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అవి కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే.. అని నేను భావిస్తున్నాను.’
‘పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే మాట్లాడటం బాధగా ఉంది. మీకు విన్నవిస్తున్నాను. పవన్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి.. దేశం కోసం బతికే మనిషి. ఆయన స్వార్థం కోసం కానీ, స్వలాభం కోసం ఏనాడు పని చేయలేదు. ఆయన హాయిగా షూటింగ్‌లు చేసుకుని సూపర్ స్టార్ హోదాతో హాయిగా బతకండని నేను తరచూ చెబుతుండే వాడిని. కానీ ఆయన జనాల కోసం ఏదో ఒకటి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. అన్నిటినీ సహిస్తూ తలవంచుకుని జనం కోసం జీవిస్తున్నాడు. . రాత్రి, పగలు కష్టపడి.. సంపాదించిన డబ్బుని పార్టీకి, ప్రజలకు ధార పోస్తున్నాడు. ఆయనకు కులాభిమానం లేదు. అందరూ ఒక్కటే అని భావిస్తారు. ఒకవేళ ఆయనకే కులపిచ్చి ఉంటే నన్ను ఇంతలా ఆదరిస్తాడా? నన్నుఈ స్థాయికి తీసుకొస్తాడా? నేను ఈ రోజు అనుభవిస్తుందంతా కూడా పవన్ కల్యాణ్ పెట్టిన భిక్షే. ఆయన చాలా మంచి వ్యక్తి సార్. దయచేసి తెలిసీ తెలియకుండా ఆయన మీద అబాండాలు వేయకండి. నేను జన సేని మనిషిని, కార్యకర్తని ఏ మాత్రం కాదు. కేవలం ఆయనను ప్రేమించే వ్యక్తిని’ అని చెప్పుకొచ్చారు బండ్ల గణేశ్.🎞️🎥