top of page
MediaFx

బెంగళూరులో నీటి కొరతే కాదు.. ఇప్పుడు ‘బీర్‌’ కూడా కష్టమే!

బెంగళూరులో నీటి సంక్షోభం యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు ఈ మహానగరంలో నీటి కొరతతోపాటు బీర్ సంక్షోభం కూడా తీవ్రతరం కానుంది. బెంగుళూరులో బీరుకు పెరుగుతున్న డిమాండ్ ఇందుకు ప్రధాన కారణం. పబ్బులు, బ్రూవరీలలో మద్యానికి అవసరానికి మించి డిమాండ్ పెరిగింది. దీంతో బ్రూవరీలలో అల్మారాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో మందుబాబులు ఇప్పటి నుంచే వర్రీ అవుతున్నారు.

ఇటీవల కాలంలో బీర్‌ విక్రయాలు పెరగడంతో అవసరమైన మద్యం సరఫరా కావడం లేదు. ఈ కారణంగా పెరుగుతున్న డిమాండ్‌ను నియంత్రించడానికి బెంగళూరులోని బీర్ షాపుల్లో వారాంతపు ఆఫర్‌లను నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీకెండ్స్‌లలో ప్రజలు తరచుగా పార్టీలకు పబ్‌ల వైపు మొగ్గు చూపుతారు. దీని కారణంగా ఇతర రోజులతో పోలిస్తే వీకెండ్స్‌లో బీర్‌కు డిమాండ్ అత్యధికంగా పెరుగుతుంది. సాధారణంగా బెంగళూరులో ప్రతి వారాంతంలో బీర్ కొనుగోలు చేయడానికి బ్రూవరీల యజమానులు ఆఫర్లు ప్రకటిస్తారు. ఇందులో బై 2 గెట్ 1 ఫ్రీ వంటి ఆఫర్లు ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బెంగుళూరులో ఇలాంటి ఆఫర్లు కనుమరుగుకానున్నాయి. ఈ ఏడాది సరఫరా – వినియోగం తమ అంచనాలను మించిపోయాయని, అందుకు తాము సన్నద్ధంగా లేమని ఓ షాప్‌ యజమాని చెబుతున్నారు.

ప్రతీయేట వేసవిలో తాము పండ్ల రుచిగల బీర్‌లను తయారు చేస్తుంటామని, ఇందుకు మామిడి, పైనాపిల్స్ వంటి పండ్లపై ఎక్కువగా ఆధారపడతామన్నారు. ఈ సంవత్సరం మామిడి పండ్ల కొరత కారణంగా పండ్ల బీర్ అమ్మకాలు తగ్గాయి. మరోవైపు ఐపీఎల్, ఎండ వేడిమి కారణంగా అమ్మకాలు కూడా పెరుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.30 వేల లీటర్ల బీర్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది మాత్రం కేవలం 9 వేల లీటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దాదాపు అందరు కస్టమర్‌లు ఇతర పానీయాల కంటే బీర్ ఆర్డర్‌లను ఎంచుకోవడంతో అమ్మకాలు 40% పెరిగాయి. దీంతో త్వరలో బెంగళూరులో వీకెండ్‌ ఆఫ్లర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పలు షాపుల యజమానులు చెబుతున్నారు.

bottom of page