top of page

వాటర్‌ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా ?


ప్రస్తుత వర్షాకాలంలో నీళ్లు కాచుకోవడానికి కొంతమంది గీజర్‌ ఉపయోగిస్తే, మరికొంతమంది గ్యాస్‌ స్టౌ వాడుతుంటారు. వీటిలో చాలామంది ఇళ్లలో ఎక్కువగా వాటర్ హీటర్​నే వాడుతుంటారు. అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు! అయితే.. ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల నీరు త్వరగా వేడెక్కడం అటుంచితే.. ఆ నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వేడి నీటితో స్నానం చేయడం వల్ల దురద, పొక్కులు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు యూజ్ చేసేటప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. ఇవి తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఎలక్ట్రిక్ హీటర్​తో బాగా వేడెక్కిన నీటితో స్నానం చేయడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు.

 
 
bottom of page