top of page
MediaFx

నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటావ్ నందన..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు సింగర్ చిత్ర. ప్రేమ, విరహం, దుఃఖం, సంతోషం ఇలా అన్ని భావాలను తన గాత్రంతో శ్రోతలను హృదయాలను మైమరిపించింది.

ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే చిత్ర మనసులో తీరని విషాదం దాగి ఉంది. తన కూతురు భౌతికంగా దూరమైనా ఇప్పటికీ తన జ్ఞాపకాలతో గడుపుతున్నారు. ఈరోజు తన కూతురు నందన వర్దంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు చిత్ర. అలాగే తన కూతురు ఫోటోను పంచుకుంటూ చివరిశ్వాస వరకు మాతోనే ఉంటావ్ అంటూ రాసుకొచ్చారు. “నువ్వు నాతో లేకపోయినా ఎప్పటికీ నాలోనే ఉంటావు. నా తుది శ్వాస వరకు నువ్వు నా గుండెల్లో బతికే ఉంటావు ” అంటూ రాసుకోచ్చింది. ప్రస్తుతం చిత్ర పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక పాటలు పాడారు చిత్ర. నాలుగు దశాబ్దాల సినీ సంగీత ప్రయాణంలో దాదాపు 25 వేలకు పైగా పాటలు ఆలపించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో పనిచేశారు. సింగర్ చిత్ర ఇంజనీర్ విజయ్ శంకర్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2002 డిసెంబర్ 18న వీరికి పాప నందన జన్మించింది. 2011 ఏప్రిల్ 14 దుబాయ్‏లో ఓ మ్యూజిక్ ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఓ విల్లాలోని స్విమ్మింగ్ పూల్‏లో పడి మరణించింది. అప్పటికీ నందన వయసు తొమ్మిదేళ్లు మాత్రమే. తన ఒక్కగానొక్క కూతురు మరణం నుండి కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. ప్రతి సంవత్సరం తన జయంతి, వర్దంతి రోజున కూతురిని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతుంటారు.

bottom of page