top of page

బెల్లి డాన్స్‌తో అదరగొట్టిన గురు బ్యూటీ..

MediaFx

వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో హీరోయిన్‌గా నటించింది రితిక సింగ్. ఈ సినిమాతో రితిక మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మాస్‌లుక్‌లో టామ్ బాయ్‌గా కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈ చిన్నది ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. తమిళ్ లో మాత్రం సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రితిక సింగ్ నటి మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా.. ఈ అమ్మడు తమిళ్ లో నటించిన ఓ మై కడవులే సినిమా భారీ హిట్ అందుకుంది. గురు సినిమా తర్వాత తెలుగులో నీవెవరో అనే సినిమా చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బెల్లి డాన్స్ తో అదరగొట్టింది రితిక సింగ్.



bottom of page