top of page

మరో వీడియో వదిలిన నటి హేమ.. ఈసారి ఇలా.. 🎬

MediaFx

బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలను, ఇటు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ రేవ్ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారని వార్తలు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే హీరో శ్రీకాంత్, నటి హేమ తమకు ఆ రేవ్ పార్టీతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.  అయితే నటి హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని ఏకంగా బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆమె తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని చేసిన వీడియో తప్పుదారి పట్టించడం కోసమే చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. ఆ వీడియో ఎలా చేశారు అన్నదానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. 

ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, తను హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో చిల్ అవుతున్నానని నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిన హేమ ఈరోజు మళ్లీ కొత్తగా ఇంకొక వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో ద్వారా తనకు బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.  అసలు తనకేమీ తెలియదు అన్నట్టు, తను ఇంట్లోనే ఉండి హ్యాపీగా వంట చేసుకుంటున్నట్టు బిర్యానీ తయారు చేస్తున్న ఒక వీడియోను హేమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అసలు బెంగళూరులో జరుగుతున్న దానితో తనకు ఎలాంటి సంబంధం లేనట్టుగా బెంగళూరు పోలీసులు చెబుతున్న హేమ ఇంకెవరో,. నేను కాదు అన్నట్టుగా హేమ వీడియో చేసి పెట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యాని తయారు చేస్తున్న వీడియోను హేమ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. పాపం మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ నటి హేమకు బాగా తిప్పలు తెచ్చిపెట్టింది. పదేపదే ఆ పార్టీలో ఉంది నేను కాదని చెప్పుకోవడానికి ఆమె పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. ఏది ఏమైనా ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా మారింది. 


 

Related Posts

See All
bottom of page