top of page
MediaFx

వేసవిలో పర్యటనకు బెస్ట్ ఎంపిక..

వేసవి కాలంలో ఎండలు మండిస్తున్నాయి. భానుడి భగభగలతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఉష్ణోగ్రత పెరిపోతోంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఎక్కడికైనా చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తూ ప్రణాళికలను వేస్తూ ఉంటారు.

ఎంత వేడి ఉన్నా దేశంలో కొన్ని ప్రాంతాలు చల్లగా ఉండి హాయిని ఇస్తూ ఉంటాయి. ఊటీ, మనాలి సహా అనేక ప్రదేశాలు సహజ సౌందర్యంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంటాయి. అదే విధంగా దేశంలోని తూర్పు భాగం కూడా సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. నగరాల్లో నివసించే ప్రజలు తరచూ శబ్దాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడికి చేరుకుంటారు. మీరు కూడా చుట్టూ పచ్చగా ఉండే అలాంటి ప్రదేశానికి వెళ్లాలనుకుంటే మీరు ఖచ్చితంగా మేఘాలయను ఎంపిక చేసుకోండి. మేఘాలయ అనేక అందమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి.

మేఘాలయలో సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ ఒక నది మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఈ నదిలోని నీరు స్ఫటికం వలె స్పష్టంగా కనుపిస్తుంది. దీనిని ఉమ్‌గోట్ నది లేదా డోకి సరస్సు అని కూడా అంటారు. ఈ నది అందంగా, ప్రశాంతంగా ఉండటమే కాకుండా చాలా శుభ్రంగా ఉంటుంది. డాకీ మేఘాలయలో భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక చిన్న పట్టణం. దీని పరిశుభ్రత, అందంతో ఈ గ్రామం 2003లో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా బిరుదు కూడా పొందింది.

bottom of page