యాసర్ ఈడీ270 ఆర్ ఎస్3 ఆర్కర్వ్డ్ మానిటర్.. ఈ గేమింగ్ మానిటర్ లో హెచ్ డీ 27 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతి అంశం స్పష్టంగా చూడవచ్చు. దీనిలో హెచ్ డీ ఎమ్ఐ 2.0 పోర్ట్‌లు, ఒక డిస్ప్లేపోర్ట్ ఉన్నాయి. కంటి ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే సుదీర్ఘ గేమింగ్ సెషన్లను సౌకర్యవంతంగా పూర్తి చేస్తుంది. చేస్తుంది. జీరో ఫ్రేమ్ డిజైన్, వెసా వాల్ మౌంట్, ఏఎమ్ డీ సాంకేతికత అదనపు ప్రత్యేకతలు. 3.900 కిలోల బరువు ఉండే ఈ మానిటర్ ధర రూ.12,699.
సామ్సంగ్ 27 అంగుళాల ఎమ్5 ఎఫ్ హెచ్ డీ స్మార్ట్ మానిటర్.. ఎల్ఈడీ బ్యాక్ లిట్ వీఏ ప్యానెల్ తో అధిక రిజల్యూజన్ కలిగిన డిస్‌ప్లే దీని ప్రత్యేకత. గేమింగ్ ను మరింత మెరుగుపరుస్తుంది. హెచ్ డీఆర్ 10 కలర్, కాంట్రాస్ట్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే కళ్లకు హాయినిస్తుంది. దీనిలో 10 వాట్ల ఇంటిగ్రేటెడ్ బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉన్నాయి. బాహ్య పరికరం లేకుండా ఆడియో అవుట్‌పుట్‌ను సమర్థంగా అందజేస్తుంది. సమస్యలు లేని గేమింగ్ తో పాటు కంటి ఒత్తిడిని తగ్గించే ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ ఉంది. 3.600 కిలోల ఈ మానిటర్ ధర రూ.15,599
బెన్ క్యూ జీడబ్ల్యూ2780టీ మానిటర్.. ఎక్కువ సమయం గేమింగ్ కు ఈ 27 అంగుళాల మానిటర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇండోర్ వినియోగానికి చక్కగా సరిపోతుంది. యాంటీ గ్లేర్ కోటింగ్ రిఫ్లెక్షన్‌లను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే సౌకర్యవంతమైన గేమింగ్ అనుభవం ఇస్తుంది. దీనిలోని తక్కువ బ్లూ లైట్ మోడ్ వల్ల కంటికి అలసట ఉండదు. ఎక్కువ గంటలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగిచుకోవచ్చు. వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ కోసం డిస్ప్లే పోర్ట్ ఏర్పాటు చేశారు. 6.600 కిలోల బరువైన ఈ మానిటర్ రూ.13,490కు అందుబాటులో ఉంది.
జెబ్రోనిక్స్ 27 అంగుళాల మానిటర్.. జెబ్రోనిక్స్ విడుదల చేసిన ఈ 27 అంగుళాల గేమింగ్ మానిటర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. స్క్రీన్ పై చిత్రాలను చాాలా స్పష్టంగా చూడవచ్చు. ఆల్ట్రా సిమ్ డిజైన్ తో డిస్ ప్లే ఆకట్టుకుంటుంది. దీనిలోని ఇన్ బిల్ట్ స్పీకర్లు మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందజేస్తాయి. ఈ మానిటర్ కు హెచ్ డీఎమ్ఐ,యూఎస్ బీ, హెడ్‌ఫోన్ జాక్ వంటి వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు. 3.500 కిలోల బరువైన ఈ మానిటర్ ను రూ.11,499కు కొనుగోలు చేయవచ్చు.
ఎల్ జీ అల్ట్రాగేర్ ఐపీఎస్.. ఆటల కోసం ప్రత్యేకంగా హెచ్ డీ డిస్ ప్లేతో ఈ మానిటర్ ను రూపొందించారు. పైగా ఎల్ జీ వంటి నమ్మకమైక బ్రాండ్ నుంచి విడుదల కావడంతో దీనికి ఆదరణ బాగుంది. ఎక్కువ గంటలు పనిచేయడంతో పాటు సమస్యలు లేని గేమింగ్ కోసం ఉపయోగపడుతుంది. దీనిలోని డిస్ ప్లే హెచ్ డీఆర్ 10కు మద్దతు ఇస్తుంది. రిచ్ కలర్స్, కాంట్రాస్ట్‌తో చూడడానికి చక్కగా ఉంటుంది. ఈ మానిటర్ సాధారణం వినియోగంతో పాటు వృత్తిపరమైన గేమర్లను అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ.11,499.